![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2(Karthika Deepam2)'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-363లో.. జ్యోత్స్న అవార్డు అందుకుంటున్నట్టు పగటికలలలు కంటుంది. అంతలోనో కార్తీక్‌ని అవార్డ్ అందుకోవడానికి రమ్మని మైక్ లో అనౌన్స్ చేస్తారు. ఆ అలికిడికి కలలోంచి బయటికి వచ్చిన జ్యోత్స్న.. జరగబోయేది ఇదే కదా అనుకుంటుంది. తీరా స్టేజ్ మీద నుంచి కార్తీక్‌ని పిలిచేసరికి.. జ్యోత్స్ననే పైకి వెళ్లి.. అవార్డ్ అందుకునేది నేను.. కార్తీక్ కాదు... నీ నోటితో నువ్వే చెప్పు బావా.. అందరికీ క్లారిటీ వస్తుందని జ్యోత్స్న అంటుంది. ఇక కార్తీక్ స్టేజ్ పైకి వెళ్లి.. సత్యరాజ్ గారు ఈ ఒక్క విషయాన్ని వదిలెయ్యండి.. నాకు అంగీకారమే జ్యోత్స్నకు అవార్డ్ ఇవ్వడమే అంటాడు కార్తీక్. దాంతో జ్యోత్స్న హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంతలో అవార్డ్ అందుకునేది కార్తీక్ కాదు. జ్యోత్స్నే అంటూ యాంకర్ అనౌన్స్ చేస్తుంటుంది.
అప్పటికే కాంచన ఏడుస్తూ.. దీపతో... దీపా ఇప్పుడు కార్తీక్ అవార్డ్ తీసుకోకపోతే జీవితాంతం ఆ బాధ వెంటాడుతుందని అంటుంది. దాంతో దీప.. అనౌన్స్ చేసే ఆమెతో.. ఒక్క నిమిషం అంటుంది. దాంతో అనౌన్స్ చేయడం ఆపేస్తుంది ఆమె. ఇంతలో దీప పైకి వెళ్లి మైక్ తీసుకుని.. నేను కార్తీక్ బాబు భార్యను.. నేను మాట్లాడాలి అనుకుంటున్నాను.. నేను ఇలా స్టేజ్ మీద మాట్లాడటం మొదటిసారి. ఎలా మాట్లాడాలో తెలియదు కానీ ఏం మాట్లాడాలో తెలుసు అని దీప అంటుంది. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అది చెప్పండి అని జ్యోత్స్న అంటుంది. మీరు సత్యరాజ్ రెస్టారెంట్ పార్టనర్ షిప్ ఎప్పుడు తీసుకున్నారని జ్యోత్స్నని దీప అడుగగా.. ఐదురోజులు అయ్యిందని జ్యోత్స అంటుంది. సత్యరాజ్ గారు.. మరి ఈ అవార్డ్ ఈ ఐదురోజులు మాత్రమే చూసి ఇస్తున్నారా? లేక కార్తీక్ గారి పనితనం చూసి ఇస్తున్నారా అని దీప అనగా.. కార్తీక్ పనితనం చూసే ఇస్తున్నారని సత్యరాజ్ అంటాడు. అయితే ఈ అవార్డ్ న్యాయంగా ఎవరికి దక్కాలో శివనారాయణ తాతయ్య గారే చెబుతారని దీప అంటుంది. దాంతో శివనారాయణను స్టేజ్ మీదకు పిలుస్తాడు సత్యరాజ్. నేనే ఎందుకు చెప్పాలని శివన్నారాయణ దీపతో అనగా. మీరు పెద్ద మనిషిగా న్యాయం చెబుతారన్న నమ్మకం నాకుంది కాబట్టి.. సరే చూస్తున్న ప్రేక్షకులు కూడా న్యాయనిర్ణీతలే.. ఈ అవార్డ్ ఎవరు తీసుకోవాలని దీప మైక్ లో అంటుంది. కార్తీక్ కార్తీక్ అని అంతా అరుస్తారు. దాంతో శివనారాయణ మైక్ తీసుకుని.. ఈ అవార్డ్ కార్తీక్‌కి అందడమే న్యాయమని అంటాడు. దాంతో కార్తీక్‌కి బ్రేక్స్ వేయడానికి జ్యోత్స్న ప్రయత్నిస్తుంది. మీ తాతకు సమాధానం చెప్పు.. నేను అవార్డ్ తీసుకోకుండా ఆగిపోతానని జ్యోత్స్నతో కార్తీక్ అంటాడు.
దాంతో కార్తీక్‌ని జ్యోత్స్న ఆపలేకపోతుంది. కిందున్న వాళ్ళంతా హ్యాపీగా ఉంటారు. మైక్ అందుకున్న కార్తీక్.. నేను ఈ స్థాయిలో నిలబడ్డానికి నా భార్య దీపే కారణం అంటూ దీపను పొగుడుతూ.. ఈ అవార్డ్‌కి నా భార్య కూడా అర్హురాలే కలిసి తీసుకుంటాం అంటాడు. ఇక దీప అప్పుడే అవార్డ్ శివనారాయణ గారి చేతుల మీద అందుకోవాలని కోరుతుంది. సత్యరాజ్ అందుకు ప్రోత్సహిస్తాడు. దాంతో శివనారాయణ తప్పక అవార్డ్ అందిస్తాడు. అప్పుడే కార్తీక్.. తాతతో తన ఛాలెంజ్ గుర్తు చేసి.. తాతా విధి ఎవరినీ వదిలిపెట్టదు.. సమాధానం చెబుతుందని అంటాడు. మేము వెళ్తాం.. అవార్డ్ ప్రధానం అయ్యింది కదా అని సత్యారాజ్‌కి చెప్పేసి జ్యోత్స్న ముందుకు వస్తాడు శివనారాయణ. చేసింది చాలు పదా.. ఆ అగ్రిమెంట్ సంగతేంటో తేల్చాలి అంటూ జ్యోత్స్నని శివన్నారాయణ ఇంటికి తీసుకొని వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |